శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్‌షిప్ చేసింది. ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలకు సంబంధించి సంవత్సర కాలానికి 50 లక్షల 50 వేల 120 రూపాయలను అందించింది. బ్యాంక్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ సూచనల మేరకు తిరుపతి బ్రాంచ్ అధికారులు.. డీడీ రూపంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈ మొత్తాన్ని అందజేశారు.
ఎస్వీబీసీకి స్పాన్సర్‌షిప్ మొత్తం అందించిన యూనియన్ బ్యాంక్
ఎస్వీబీసీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది. వారు ఇవ్వాలనుకున్న మొత్తాన్ని డీడీ రూపంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్‌షిప్