ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి - జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమించి పరీక్షల కోసం సన్నద్ధమైతే.. ప్రభుత్వం తమ ఆశలపై నీళ్లు చల్లిందని అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. అప్పులు చేసి మరీ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలీక కుమిలిపోతున్నారు.

job calender
జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

By

Published : Jun 22, 2021, 8:24 AM IST

జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై అభ్యర్థులు, మేధావులు పెదవి విరుస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులను ప్రకటిస్తుందని ఆశిస్తే.. మొండిచేయే చూపారని నిరాశ చెందుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్న శిక్షణ అంతా.. బూడిదలో పోసిన పన్నీరయిందని అభ్యర్థులు.. ఆవేదన చెందుతున్నారు.

సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న వేళ.. అభ్యర్థులు తమ స్వప్నం నెరవేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందపడ్డారు. వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ నోటిఫికేషన్లు వస్తాయని ఆశించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 వేల ఉద్యోగాల్లో.. గ్రూప్‌-1, గ్రూప్ర్‌-2 పోస్టులకు కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపడంతో.. వీటి కోసమే కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల ఆశలు అడియాసలయ్యాయి.

శిక్షణ కోసం లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థులు..

జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 450 పోలీసు ఉద్యోగాలకే నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. వాటిపైనే ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు హతాశులయ్యారు. శిక్షణ కోసం అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు చెల్లించిన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలీని దిక్కుతోచని స్థితిలో.. అభ్యర్థులు ఉన్నారు. ముందుగా ప్రకటించిన విధంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details