ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఉగాది సంబురాలు - today ugadhi clebrations in andhrapradesh news update

రాష్ట్రవ్యాప్తంగా ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ugadhi clebrations
రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది సంబురాలు

By

Published : Apr 13, 2021, 8:11 PM IST

అప్పన్న సన్నిధిలో తెలుగు సంవత్సరాది..

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నూతన తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించారు. అధికారులు నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

క‌న‌క‌మ‌హాల‌క్ష్మి ఆమ్మ‌వారి ఆల‌యంలో..

విశాఖప‌ట్నం బురుజుపేట‌లో కొలువై ఉన్న శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి ఆమ్మ‌వారి ఆల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం జ‌రిగింది. అమ్మవారికి విశేష పూజ‌ల అనంత‌రం హోమం నిర్వ‌హించారు. దేవ‌స్దానం ఈవో మాధ‌వి, ఇత‌ర అధికారులు, భ‌క్తులు ఈ పంచాంగ శ్ర‌వ‌ణంలో పాల్గొన్నారు.

స్వయంభూ విఘ్నేశ్వరుడి సన్నిధిలో..

చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడికి శ్రీ ప్లవ నామ సంవత్సర, ఉగాది పండుగను పురష్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ శాఖ అధికారులు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

నూకాలమ్మ ఆలయంలో ఉగాది..

అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని మాజీమంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ దర్శించుకున్నారు. ఉగాది సంబరాల్లో భాగంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు బుజ్జి బాబు, విజయ్ బాబులను సత్కరించారు.

సంప‌త్ వినాయ‌క ఆల‌యంలో..

విశాఖ‌లోని శ్రీ సంప‌త్ వినాయ‌క ఆల‌యంలో స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు బారులు తీరారు. కొత్త వాహ‌నాల‌కు పూజ‌ల‌ను నిర్వ‌హించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకున్నారు.

అన్నవరంలో ఉగాది వేడుకలు..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్రత పురోహిత పూర్వపు బ్రహ్మ పాలకి పట్టాభి రామ్మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆశీనులను చేసి ప్రాకార సేవ నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో ఉగాది వేడుకల్లో.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపేటలోని బీసీ కమ్యూనిటీ భవనంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం దంపతులు పంచాంగ శ్రవణం చేశారు.

కోనసీమలో వేడుకగా ఉగాది..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ప్రజలు ఉగాదిని వేడుకగా జరిపారు. ఉగాది పురస్కరించుకుని భక్తులు పోలు దేవాలయాలను దర్శించుకున్నారు. దుర్గాదేవి గ్రామదేవతల ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆంధ్ర అరుణాచలంలో ఉగాది సంబరాలు...

ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి గాంచిన.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో.. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో విశిష్ట పూజల్లో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణంలో పాల్గొని రాశి ఫలాలు తెలుసుకొన్నారు.

కర్నూలులో కన్నుల పండువగా ఉగాది..

ఉగాది పండుగను కర్నూలులో భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

కడపలో కనువిందుగా పోలీసుల ఉగాది..

ఎపుడూ ఖాకీ యూనిఫారంతో కనిపించే పోలీసులు ఉగాది పండగ సందర్భంగా పంచె కట్టుతో కనిపించారు. ఉగాది పండుగను కడప జిల్లా పోలీసులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానంగా నగరంలోని చిన్నచౌకు, వన్ టౌన్ పోలీసులు తెలుగు వారికి శుభ సూచకంగా తెలుపు వస్త్రాలు ధరించారు. ఎస్పీ అంబురాజన్ ప్రత్యేకంగా తెలుపు వస్త్రాలు ధరించి.. పండగ జరుపుకున్నారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పని ఒత్తిళ్లలో ఉన్న పోలీస్ కుటుంబాలకు ఈ పండగ చాలా సంతోషాన్ని ఇస్తుందని ఎస్పీ అన్నారు.

పశ్చిమలో ఉగాది పర్వదినం పురష్కరించుకొని..

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ వారికి.. భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పసుపు కొమ్ములతో తయారుచేసిన చీరతో అమ్మవారికి అలంకరణ చేశారు. పసుపు కొమ్ముల అలంకరణలో అమ్మవారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు.

తణుకు పట్టణంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు.

నెల్లూరులో ఉగాది సంబరాలు..

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట శ్రీ పోలేరమ్మ గ్రామ దేవతకు భక్తులు భారీగా చేరుకొని పూజలు చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద అంబళ్లు ప్రసాదాలు పంపిణీ చేశారు.

నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి అంబలి నైవేథ్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కృష్ణా జిల్లాలో ఉగాది వేడుకలు..

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో.. ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు.. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. అధికారులతోపాటుగా వేదపండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విజయనగరంలో ఘనంగా ఉగాది వేడుకలు..

శ్రీ ప్ల‌వ‌నామ సంవ‌త్స‌ర ఉగాది వేడుక‌లు విజయనగరం జిల్లా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఘ‌నంగా జ‌రిగాయి. జిల్లా కలెక్టర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. మ‌హారాజ సంగీత, నృత్య క‌ళాశాల విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, నాద‌స్వ‌ర క‌చేరీ ఆక‌ట్టుకున్నాయి. శ్రీ ప్ల‌వ‌నామ సంవ‌త్స‌రంలో జిల్లా ప్ర‌జ‌లంద‌రికీ మంచి ఆరోగ్యం సిద్దించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆకాంక్షించారు.

ఉగాది పురష్కారాలు..

సీతారామ‌స్వామి ఆల‌య పూజారి సోమేశ్వ‌ర శ‌ర్మ‌, గౌరీశ్వ‌ర‌స్వామి ఆల‌య పూజారి మ‌ల్లేశ్వ‌ర‌శాస్త్రి, ఉమా రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌య పూజారి భువ‌నేశ్వ‌ర ప్ర‌సాద్‌లకు దేవాదాయ శాఖ ప్ర‌క‌టించిన ఉగాది పుర‌స్కారాల‌ను క‌లెక్ట‌ర్ అంద‌జేశారు. వారిని దుశ్శాలువ‌తో స‌త్క‌రించి, రూ.10వేలు న‌గ‌దు పుర‌స్కారాన్ని కూడా అందించారు. ఈ ఉగాది వేడుక‌ల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ లు జి.సి.కిశోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, దేవాదాయ‌శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్ కె.శాంతి, త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు..

ఇవీ చూడండి..

ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details