ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TWO PEOPLE DIED: హైదరాబాద్​లో మ్యాన్​ హోల్​లోకి దిగి ఇద్దరు కార్మికుల మృతి

డ్రైనేజీ క్లీన్ చేయాలంటూ అర్ధరాత్రి పిలిచారు.. సమస్య తీర్చేందుకని రాత్రికిరాత్రే... ఇద్దరు ఒప్పంద కార్మికులు మ్యాన్​హోల్​లోకి దిగారు. అదే వారి పాలిట యమపాశమైంది. లోపల ఊపిరాడక వారిద్దరూ చనిపోయారు. అందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా... మరొకరి గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో జరిగింది.

Two workers were killed when they landed in a manhole for drainage cleaning
తెలంగాణలో మ్యాన్​ హోల్​లోకి దిగి ఇద్దరు కార్మికుల మృతి

By

Published : Aug 4, 2021, 9:49 AM IST

డ్రైనేజి క్లీన్ చేస్తూ... ఇద్దరు ఒప్పంద కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. సాహెబ్ నగర్​లో డ్రైనేజి క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్ లోపలికి దిగిన అంజయ్య, శివలు గల్లంతయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంట పాటు శ్రమించిన పోలీసు బృందాలకు శివ మృతదేహం లభ్యమైంది.

భద్రతా చర్యలు తీసుకోలేదా?

అంజయ్య మృతదేహం కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్​లోకి దిగటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి వేళల్లోనే ఇలాంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.

మిన్నంటిన రోదనలు..

మృతులు చంపాపేట్, సరూర్ నగర్​లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు చనిపోయిన విషయాన్ని సంబంధిత కుటుంబాలకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ... ఘటనాస్థలానికి చేరుకున్నారు. పని నిమిత్తం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:

జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details