ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అవునండి! ఇది నిజం. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. మల్కాన్‌గిరికి చెందిన ఇద్దరు యువతులు ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకున్నారు. ఒకరికి ఒకరు ప్రాణమయ్యారు. ఇద్దరి ఇళ్లలోనూ పెళ్లి ప్రస్తావనలు వస్తుండటం వల్ల.. తాము విడిపోతామన్న ఆలోచన నిలువనీయలేదు. వేర్వేరుగా ఉండలేమని పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. ఒకరు లింగమార్పిడి చేసుకుని పురుషునిగా మారాలని నిర్ణయించారు. పెద్దలకు చెప్పి ఒప్పించారు. అందుకుగాను వీళ్లలో ఒకరు గతేడాది లింగమార్పిడి చేయించుకున్నారు. ఈ రోజున ప్రేమికుల దినోత్సవం కావడం వల్ల వాళ్లిద్దరు ఒక్కటి కావాలనుకున్నారు. ఇద్దరి జాతకాల ప్రకారం నాలుగు రోజుల ముందుగానే 10న ముహూర్తం కుదిరింది. బంధుమిత్రుల కోలాహలం మధ్య సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
మగాడిగా ఓ మగువ.. పెళ్లి పీటలెక్కిన ఆ జంట! - two women people are married at malkhangiri in odisha
మనసులు కలవాలి.. అర్థం చేసుకునే వారు దొరకాలి. మగైతేనేం..ఆడైతేనేం. ఇలానే అనుకున్నారేమో ఆ ఇద్దరు యువతలు. అందుకే ఒకరు లింగ మార్పిడి చేయించుకుని.. జంటగా ఒకటై పెళ్లిపీటలెక్కారు.
మగాడిగా ఓ మగువ.. పెళ్లి పీటలెక్కిన ఆ జంట!