అర్ధరాత్రి.. ఆపై అతివేగం... నిర్లక్ష్యం... ఫలితం రెండు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ మేడ్చల్ జిల్లా సూరారానికి చెంది ప్రమోద్‌రెడ్డి(22), వరంగల్‌కు చెందిన సునై రెడ్డి(22) ఇద్దరూ స్నేహితులు. కలిసి చదువుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బాచుపల్లి నుంచి బౌరంపేట వైపు బైక్ వేసుకుని వెళుతున్నారు.
Road Accident: ఆగి ఉన్న డీసీఎం ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదాలు
ఆగి ఉన్న డీసీఎంను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదం తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బౌరంపేటలో జరిగింది.
accident
బౌరంపేట సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, దీనికితోడు అతివేగంగా వస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇదీ చదవండి: