Attempt to Murder on Student : 10వ తరగతి విద్యార్థులపై తోటి స్నేహితులు కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జరిగింది. తన ప్రియురాలికి దుర్గాప్రసాద్ హాయ్ చెప్పాడనే అక్కసుతో నిందితులు దాడి చేశారు. దుర్గాప్రసాద్‌తో కలిసి ఫిలింనగర్‌లో పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు మాయమాటలు చెప్పి అతణ్ని అత్తాపూర్‌లోని మూసీ వద్దకు తీసుకెళ్లారు.. అక్కడ ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. 307 సెక్షన్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడని.. విద్యార్థిపై కత్తులతో దాడి - రాజేంద్రనగర్‌లో విద్యార్థిపై స్నేహితుల దాడి
Attempt to Murder on Student: విద్యార్థుల్లో క్రూరత్వం రానురాను పెరిగిపోతోంది. హింసాత్మక లక్షణాలు పెచ్చుమీరుతున్నాయి. వయసుకు మించిన పనులు, అనాలోచిత నిర్ణయాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడనే అక్కసుతో పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడితో కలిసి మరో విద్యార్థిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడం ఇందు ఓ ఉదారణహగా చెప్పవచ్చు. ఈ అమానుష ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది.
విద్యార్థిపై కత్తులతో దాడి