అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. ఇద్దరు విద్యార్థులు 151 గంటలుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. వెలగపూడిలో శ్రీకర్, రవిచంద్ర అనే ఇద్దరు విద్యార్థులు గత 4 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని వారిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై దీక్షా శిబిరంలోని రైతులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ ఆరోగ్యం గురించి తమకు చింతలేదని.. అమరావతిని సాధించేవరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. వారికి మద్దతుగా అమరావతి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
అమరావతి కోసం ఇద్దరు విద్యార్థుల నిరాహారదీక్ష - అమరావతి ఆందోళనలు తాజా వార్తలు
వారిద్దరూ విద్యార్థులు. అమరావతి రాజధానితో తమ భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ఉంటుందని కలలుకన్నారు. ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లకుండా.. ఉన్న ఊరిలోనే మంచి ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డారు. అయితే మూడు రాజధానుల ప్రకటనతో కంగుతిన్నారు. ఇప్పుడు అమరావతిని కాపాడుకునేందుకు తమలాంటి వారి ఎంతోమంది విద్యార్థుల తరఫున నిరాహారదీక్ష చేపట్టారు.

అమరావతి కోసం ఇద్దరు విద్యార్థుల నిరాహారదీక్ష
Last Updated : Feb 9, 2020, 2:52 PM IST