తెలంగాణలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి - యాదగిరిగుట్టలో భవనం కూలీ నలుగురు మృతి
18:55 April 29
YADADRI: శిథిలాల కింద చిక్కుకున్న నాలుగు కుటుంబాలు
Building Collapsed in Yadagirigutta: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా కూలిన రెండతస్తుల భవనాన్ని.. 30 ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..