తెలంగాణ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. సామ కృష్ణశ్రీ, సామ వైష్ణవి అనే అక్కాచెల్లెళ్లు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. కృష్ణశ్రీ పదో తరగతి, వైష్ణవి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బాలికలు అదృశ్యం కావటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
తల్లితో గొడవ పడినట్లు బాలికల తాతయ్య రాజయ్య తెలిపాడు. బాలికలు సాయంత్రం 4గంటలకు ఫోన్ చేసి... సమీప గ్రామంలోని తమ స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లామని చెప్పినట్లు రాజయ్య పేర్కొన్నాడు.