'ఎంత అరిచినా వినలేదు.. కుక్కపిల్లలను కాటేసింది' - నాగోల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పాము కాటుకు రెండు కుక్కపిల్లలు మృతి
హైదరాబాద్ నాగోల్లో తల్లికుక్క అరుస్తున్నా పట్టని ఓ నాగుపాము బుసలు కొడుతూ కాటేయగా రెండు కుక్కపిల్లలు మృతి చెందాయి.
two-puppies-died-in-snake-bite
తెలంగాణలోని హైదరాబాద్ నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని కార్ల మరమ్మతుల షెడ్లో ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అటుగా వచ్చిన నాగుపాము.. కుక్కను చూసి బుసలు కొట్టింది. తమ పిల్లలను రక్షించుకుందామని కుక్క ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. పాము కుక్క పిల్లలపై బుసలు కొడుతూ కాటు వేసింది. ఘటనలో రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే మరణించాయి. కుక్క అలాగే అరుస్తుండటంతో..పాము అక్కడినుంచి జారుకుంది.