ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు'

ఏపీ గేమింగ్ చట్టం-1974లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

AP high court
AP high court

By

Published : Nov 4, 2020, 10:39 PM IST

ఆన్​లైన్ గేమింగ్ చట్టంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ జంగిల్ గేమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీవోవోతో పాటు ఆ సంస్థ యాజమాన్యం మరో పిటిషన్ వేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి రాష్ట్రంలో ఆన్​లైన్ గేమింగ్, బెట్టింగ్​లను నిషేధిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్ 25న ఈ సవరణ ఆర్డినెన్స్​కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం మేరకు ఆన్​లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్​ నిర్వహించే వారు శిక్షార్హులని ప్రభుత్వం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details