ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలం విద్యుత్​ కేంద్రంలో నెలాఖరుకు మరో రెండు యూనిట్లు - srisailam power plant production

అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న శ్రీశైలం జలవిద్యుత్​ కేంద్రంలో ఈ నెలాఖరుకు మరో రెండు యూనిట్లు సిద్ధమవుతాయని.. తెలంగాణ జెన్​కో- ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకరరావు వెల్లడించారు. సొంత పరిజ్ఞానంతోనే పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

two-more-units-ready-
two-more-units-ready-

By

Published : Dec 16, 2020, 9:28 PM IST

అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ప్లాంటు పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలంగాణ జెన్​కో- ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు. ప్లాంటు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం 300 మెగావాట్లు..

ఇప్పటికే 2 యూనిట్లను పునరుద్ధరణతో 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందన్న ప్రభాకరరావు... ఈ నెలాఖరుకు మరో యూనిట్ సిద్ధమవుతుందని తెలిపారు. మార్చి నాటికి మరో 2 యూనిట్లు అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్కువ దెబ్బతిన్న నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయన్నారు.
సొంత పరిజ్ఞానం..

అన్ని యూనిట్లను సిద్ధం చేసి రివర్సబుల్ పంపింగ్ పద్ధతిలో 900 మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పూర్తిగా తెలంగాణ జెన్​కో అధికారుల సాంకేతిక పరిజ్ఞానం, పనితీరుతోనే పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల వందల కోట్ల రూపాయలు ఆదా అవడమే కాకుండా పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.

ఇవీచూడండి:

'పోలవరం సవరణ అంచనాలను ఆమోదించండి'.. కేంద్రాన్ని కోరిన సీఎం

ABOUT THE AUTHOR

...view details