తెలంగాణలోని మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల్లో ఇవాళ నాలుగు మృతదేహాలు(Dead bodies found) లభ్యమయ్యాయి. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం రోజున మానేరు వాగు చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లగా... వారిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు((missing in Manair check dam). ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థి గణేశ్ మృతదేహం(dead body found in water) సోమవారం లభ్యమైంది. ఇవాళ వెంకటసాయి, క్రాంతి, అజయ్, రాకేశ్ మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మనోజ్ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ విచారం
మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటనపై మంత్రి కేటీఆర్(ktr news) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీతో మంత్రి మంగళవారం ఉదయం మాట్లాడారు. ఈ ఘటనపై ఆరా తీశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యల కోసం హైదరాబాద్ నుంచి గజఈతగాళ్ల బృందం ఘటనా స్థలికి చేరుకుంది. కాగా డీఆర్ఎఫ్(DRF News) అధికారులతోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla news) జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాకేంద్రం శివారులోని మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు(students) గల్లంతు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వారిలో రాజీవ్‌నగర్‌కు చెందిన గణేశ్ మృతదేహం సోమవారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాకేంద్రం వెంకంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు.
ముమ్మర గాలింపు