ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణలోనూ ప్రతాపం చూపుతోంది. ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏటూరునాగారంలో ఒకరికి, పస్రాలో మరొకరికి కరోనా సోకినట్టు ప్రకటించారు. వీరిద్దరూ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. ఇద్దరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి...
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో ఇద్దరు, అంగడిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జహీరాబాద్, కొండాపూర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకింది.