ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణనూ కలవరపెడుతోంది. కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 18 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నారు. 18 మందిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని, అతడిని ఇంటికి పంపించేశామని పేర్కొన్నారు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు - కోవిడ్ 19
లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వివరాలు తెలిపారు. వీరితో కలిపి మొత్తం రాష్ట్రంలో 18 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
కొత్తగా తెలంగాణలో మరో రెండు పాజిటివ్ కేసులు