తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణం కేసులో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు వెలుగు బయటపడుతున్నాయి. తాజాగా మరో ఇద్దర్ని ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భూపాల్ రెడ్డి, నాగేందర్ రెడ్డి కలిసి 25 డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ములు దండుకున్నట్లు అనిశా విచారణలో తేలింది.
ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులు అరెస్టు - two more arrested in esi scam
తెలంగాణలోని ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.
![ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులు అరెస్టు ఇద్దరు నిందితులు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5450126-587-5450126-1576935726955.jpg)
ఇద్దరు నిందితులు అరెస్టు
దేవికారాణికి వీరిద్దరూ పూర్తిగా సహకరించారు. ఈ ముగ్గురు కలిసి సొమ్ము కొల్లగొట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనిశా అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.