Maoists killed: పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు జరిగాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి - mulugu news
![తెలంగాణలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి Two Maoists killed in Police Encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14214914-961-14214914-1642479665529.jpg)
09:39 January 18
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్
చనిపోయిన వారిలో సుధాకర్
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వారిలో జీఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ను చికిత్స కోసం హెలికాప్టర్లో హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు. మరణించిన వారిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి
LAND REGISTRATIONS:37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్న సీఎం