అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్నపాటి విమానం ప్రమాదానికి గురైంది. ట్విన్ ఇంజిన్ సెస్‌నా-340 అనే విమానం శాన్ డియాగో శివారు ప్రాంతంలోని నివాస గృహాలపై కుప్పకూలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు తెలిపారు.
ఇళ్ల మధ్యలో కూలిన విమానం.. ఇద్దరు మృతి - plane crash
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. నివాస గృహాలపై కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
two died and two injured in Plane crash in California
ఆరిజోనాలోని యుమా నుంచి ఈ విమానం టేకాఫ్ అయ్యింది. గంట తర్వాత కాలిఫోర్నియా చేరుకున్న విమానం.. ఉన్నట్లుండి అక్కడ ఉన్న ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదంలో కొన్ని ఇళ్లు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కూలిన ప్రదేశంలో ఓ స్కూల్ ఉంది. అదృష్టవశాత్తూ విద్యార్థులు అంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
TAGGED:
plane crash