ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాల ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం - ap crime news

Road accident: చర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే..?

Road accident
పాఠశాల ఆటోను ఢీకొన్న లారీ

By

Published : Sep 8, 2022, 7:44 PM IST

Road accident: తెలంగాణలోని మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు పాఠశాల విద్యార్థినులు ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్‌ వినోద్​ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాఠశాల ఆటోను ఢీకొన్న లారీ

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details