ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

delta plus: ఏపీలో 2 డెల్టా ప్లస్ కేసులు.. - ఏపీలో డెల్టా ప్లస్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. లోక్​సభలో ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో 2, ఏపీలో 2 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది.

Delta Plus cases in AP
ఏపీలో డెల్టా ప్లస్ కేసులు

By

Published : Jul 30, 2021, 7:11 PM IST

తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డెల్టా ప్లస్‌ కేసులపై లోక్​సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. తెలంగాణలో 2, ఏపీలో 2 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది. దేశంలో ఈ నెల 23 వరకు 70 డెల్టా ప్లస్ కేసులు నమోదు కాగా అందులో ఏపీ, తెలంగాణలో రెండేసి కేసులు ఉన్నట్టు పేర్కొంది.

డెల్టా ప్లస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 23 నమోదు కాగా.. ఆ తరువాత మధ్య ప్రదేశ్​లో 11 కేసులు ఉన్నాయని సమాధానం ఇచ్చింది. వైరస్​లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు గాను ఇన్సకాగ్​ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో సభ్యులుగా ఉన్న ల్యాబ్​లు ఎప్పటికప్పుడు వైరస్ జినోమ్​ సీక్వెన్స్ చేస్తాయని ప్రకటించింది.

ఇదీ చదవండి: Corona third wave alert: 'ఆగస్టు 31 నాటికి ఆక్సిజన్​ జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details