తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో శివకుమార్ అనే వ్యక్తి... పురుగుల మందు తాగి... తన ఇద్దరు కూతుళ్లకూ తాగించాడు. ఈ ఘటనలో అతడి చిన్నకూతురు ప్రాణాలు కోల్పోయింది. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ: ఇద్దరు కూతుళ్లకు పురుగుమందు తాగించిన తండ్రి - Two daughters, father attempted suicide at sangareddy district
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లకు పురుగుల మందు తాగించి, తానూ తాగాడు. ఈఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది.

తెలంగాణ : పిల్లలలో సహా పురుగుల మందు తాగిన తండ్రి... చిన్నారి మృతి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్‌కు చెందిన శివకుమార్.. హైదరాబాద్‌లో అత్తగారి ఇంట్లో ఉంటూ పనిచేస్తున్నాడు. గురువారం తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని ఆత్మకూర్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో పురుగుల మందు తాగి... కూతుళ్లతో తాగించాడు. రోడ్డు పక్కనపడి ఉన్నవాళ్లను చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే శివకుమార్ చిన్నకూతురు ప్రాణాలు కోల్పోయింది. అత్తమామలు చీటికిమాటికి గొడవ పడుతున్నాడని శివకుమార్ చెప్పాడు.
ఇదీచదవండి.