తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నవాబుపేట మండలం ఇప్పటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు గడ్డివాములోకి వెళ్లి ఉంటారని... దానికి మరో బాలుడు నిప్పుపెట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటన నిన్న సాయంత్రం ఆరుగంటలకు జరిగింది.
గడ్డివాముకు నిప్పంటుకుని ఇద్దరు చిన్నారులు మృతి - kids died
గడ్డివాముకు నిప్పంటుకుని.. మంటలు చెలరేగిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరులో ఈ ప్రమాదం జరిగింది.

కాలిపోతున్న గడ్డివాము
గడ్డివాములో మంటలు చెలరేగి చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఇద్దరు చిన్నారులను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఏడు గంటలకు ఒకరు, రాత్రి పది గంటలకు మరొకరు మృతి చెందారు.
ఇదీ చదవండి:పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి