ఇద్దరు బిడ్డలతో సహా కాల్వలో పడి తండ్రి మృతి - crime news in eastgodavari district
![ఇద్దరు బిడ్డలతో సహా కాల్వలో పడి తండ్రి మృతి eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8056258-286-8056258-1594935926079.jpg)
00:08 July 17
ఇద్దరు బిడ్డలతో సహా కాల్వలో పడి తండ్రి మృతి
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో ఇద్దరు పిల్లలు సహా తండ్రి మరణించారు. గరగ శ్రీను(34), ఆయన కుమారుడు సుభాష్ (7), కుమార్తె లక్ష్మీదుర్గ(4) గురువారం సాయంత్రం పుష్కర కాలువలో పడి మృతి చెందారు. కాలువలో ఉన్న మృతదేహాలను స్థానికులు బయటికి తీశారు. స్నానానికి దిగి మరణించారని కొందరు.. పిల్లలతో పాటు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని మరికొందరు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కోరుకొండ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: