తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామం పులిచింతల ప్రాజెక్టు దిగువభాగంలో కృష్ణా నదిలో ఇద్దరు బాలురు.. నరేందర్, వేణుగోపాల్ ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు మరో నలుగురు ఈతకు వెళ్లగా.. వేణుగోపాల్‌ను వారంతా కలిసి ఒడ్డుకు తీసుకువచ్చారు.
కృష్ణా నదిలో ఇద్దరు బాలురు గల్లంతు - two boys missing in krishna river
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతైన ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామం పులిచింతల ప్రాజెక్టు వద్ద జరిగింది. వీరిలో నరేందర్ మృతి చెందగా.. అక్కడ ఈతకు వెళ్లిన మరో నలుగురు వేణుగోపాల్‌ను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
two-boys-missing
నరేంద్ర కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి.. చాకచక్యంగా మృతదేహాన్ని కృష్ణా నది ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతదేహానికి పంచనామా చేసి బంధువులకు అప్పగించారు. చిన్నారి మృతితో వజినేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు.
ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్