ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూల్​డ్రింక్​ అనుకొని పురుగుల మందు తాగి ఇద్దరు చిన్నారుల మృతి - CRIME NEWS IN TELANGANA

వరుసకు ఆ చిన్నారులు బావ, బావమరిదులు... ఇద్దరూ జంటగా ఆడుకునేవారు. పాఠశాల ముగిశాక ఆడుకోవడానికి పక్కనే ఉన్న చేనులోకి వెళ్లారు. కూల్​ డ్రింక్​ అనుకుని అక్కడ ఉన్న డబ్బాలోని పురుగుల మందు తాగేశారు. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరులో జరిగిన విషాద ఘటన వివరాలివి..!

two-boys-died-after-drinking-insecticide-in-narsayapalli

By

Published : Nov 14, 2019, 11:44 AM IST

కూల్​డ్రింక్​ అని తాగారు...ప్రాణాలు కోల్పోయారు..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో విషాదం జరిగింది. పిట్టలగూడెంకు చెందిన ఇద్దరు విద్యార్థులు పురుగుల మందు సేవించి మృతి చెందారు. తుమ్మల భాస్కర్(12), బన్నీ(11) అనే విద్యార్థులు బుధవారం పాఠశాల ముగిశాక ఇంటి పక్కనే ఉన్న పత్తి చేనులోకి ఆడుకోవడానికి వెళ్లారు. చేనులో కనిపించిన పత్తి మందును కూల్​ డ్రింక్​ అనుకుని తాగారు. కొద్దిసేపట్లోనే ఇంటికి వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన చిన్నారులను చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శోకసంద్రంలో స్నేహితులు...

ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే బన్నీ మరణించాడు. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. వరసకి బావ, బావమరదులైన వీరి మరణంతోకుటుంబీకులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ఫలించని స్నేహితుల కష్టం.. షేక్ ఖాజావలి మృతి

ABOUT THE AUTHOR

...view details