AMARAVATI FARMERS MAHAPADAYATRA 12th DAY : అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ రైతులు చేపట్టిన రెండో విడత మహాపాదయాత్ర పన్నెండో రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలోని పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో రైతుల పాదయాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నియోజకవర్గం హుస్సేన్‌పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించి రెడ్డిపాలెం నుంచి వడ్లమన్నాడు చేరుకోనుంది. భోజన విరామం అనంతరం.. వేమవరం మీదుగా కవతవరం వరకూ దాదాపు 15కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
పన్నెండో రోజుకు చేరిన మహాపాదయాత్ర.. ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు - కవతవరం
MAHAPADAYATRA : అడుగడుగునా స్థానికుల ఘనస్వాగతాలు, పూలాభిషేకాలతో.. అమరావతి రైతుల మహాపాదయాత్ర పన్నెండో రోజుకు చేరుకుంది. ప్రతి గ్రామంలోని ప్రజలు స్వచ్చందంగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ రైతుల వెంట నడుస్తున్నారు.
![పన్నెండో రోజుకు చేరిన మహాపాదయాత్ర.. ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు AMARAVATI FARMERS MAHAPADAYATRA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16449566-53-16449566-1663908547309.jpg)
AMARAVATI FARMERS MAHAPADAYATRA
పెడనలో ఘనస్వాగతం: పెడనలో మహాపాదయాత్ర రైతులకు పెద్ద ఎత్తున స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ హారతులు పట్టారు. 'మా ఊరు పెడన.. మా రాజధాని' అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ స్థానికులు వారి వెంటే నడిచారు.
ఇవీ చదవండి: