తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇస్తే... ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడినుంచి రాజధాని తరలిస్తోందని తుళ్లూరులో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటి సిఫార్సులు ఆమోదిస్తే.. తామంతా రోడ్డుపై పడతామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఇక్కడే రాజధాని ఉంచాలని కోరారు.
'బంగారు భవిష్యత్ కోసం భూములిస్తే.. ఇలా చేస్తారా' - అమరావతి కోసం తుళ్లూరు మహిళల ఆందోళన వార్తలు
అమరావతి నుంచి రాజధానిని మారిస్తే తమకు చావే దిక్కని తుళ్లూరు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమాధులు ఇక్కడే కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ బిడ్డల భవిష్యత్ కోసం భూములిచ్చామని... ఇప్పుడు తమ పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు.
అమరావతి రైతుల ఆవేదన