తుళ్లూరులో ప్రధాన రహదారిపై చేపట్టిన ఆందోళనను రైతులు, మహిళలు విరమించారు. ఐకాస నేతలు, తెలుగుదేశం నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌కుమార్.. డీఎస్పీ శ్రీనివాసులుతో చర్చలు జరిపారు. అమరావతికి అనుకూలంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు, మహిళలపై రాళ్లదాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేసేందుకు డీఎస్పీ అంగీకరించారని రైతు ఐకాస కన్వీనర్ సుధాకర్ తెలిపారు. అలాగే మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేస్తున్నవారి నుంచి రక్షణ కల్పించేలా పికెట్ ఏర్పాటుకు సమ్మతం తెలిపారన్నారు. డీఎస్పీ ఇచ్చిన మాట అమలు చేయకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారాపు అన్నారు.
తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు - అమరావతి రైతులపై రాళ్ల దాడి తాజా వార్తలు
తుళ్లూరులో రోడ్డుపై రైతులు, మహిళలు ఆందోళన విరమించారు. ఉద్దండరాయునిపాలెం రైతు దీక్షా శిబిరం వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.
తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు
ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరంపై దాడికి వ్యతిరేకంగా.. రైతులు, మహిళలు రాత్రి నుంచి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 356 రోజు రాజధాని రైతుల ఆందోళన.. రోడ్డుపై బైఠాయింపు
Last Updated : Dec 7, 2020, 4:05 PM IST