తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదులింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా తిరిగి తుళ్లూరు చేరుకోనుంది. ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు వేలాదిగా తరలివస్తున్నారు. దీని ద్వారా అమరావతి ఆకాంక్షను బలంగా చాటాలని రైతులు భావిస్తున్నారు.
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ - తుళ్లూరులో రైతుల ర్యాలీ వార్తలు
అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. ఈ నిరసనలో భాగంగా రైతులు 29 గ్రామాల మీదుగా భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీగా తరలివచ్చారు.
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ
ఇదీ చదవండి :అమరావతిలో.. మరో గుండె ఆగింది!