మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా తుళ్లూరులో మహాధర్నా కొనసాగుతోంది. రైతులు, మహిళలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అన్నదాతలు అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. మరికొందరు ఉరి తాళ్లు బిగించుకొని తమ ఆవేదనను తెలియజేశారు. తమకు మద్దతు తెలిపేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని... రైతులు ఆరోపించారు.
తుళ్లూరులో ఏడో రోజూ కొనసాగుతున్న మహాధర్నా - తుళ్లూరులో రైతుల మహాధర్నా
రాజధాని కోసం తుళ్లూరులో ఏడో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, మహిళలు నల్లదుస్తులతో దీక్షలో పాల్గొన్నారు.
tulluru farmers darna in guntur