ఇది ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందే కానీ భారతదేశ బడ్జెట్‌లా లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, పోర్టులు, లోటు బడ్జెట్ వంటి ఏ ఒక్క అంశం కూడా లేదన్నారు.
బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం: తులసిరెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందన్నారు.
తులసిరెడ్డి
ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు ఏ ఒక్కటి లేకపోవడం... అవి సాధిస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:'బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనేది..?'