రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన వికేంద్రీకరణ బిల్లు, కేంద్ర ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ ఎక్కడ ఉండాలో నిర్ణయించే హక్కు రాష్ట్రానికి ఉంది కానీ హైకోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
'రాజ్యంగ విరుద్ధంగా ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించరు'
రాజ్యంగ విరుద్ధంగా ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించరని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. బిల్లులో తనకు లేని అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కర్నూలులో ఉండాలని నిర్ణయించిందన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు
హై కోర్టు అమరావతిలో ఉండాలని గతంలోనే రాష్ట్రపతి నిర్ణయించారని ఇప్పుడు దాన్ని మార్చాలంటే తిరిగి రాష్ట్రపతే నిర్ణయించాలన్నారు. బిల్లులో తనకు లేని అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కర్నూలులో ఉండాలని నిర్ణయించిందన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యంగ విరుద్ధంగా ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించరని.. ఒకవేళ ఆమోదించినా న్యాయస్థానాల్లో బిల్లులు చెల్లవన్నారు.
ఇదీ చదవండి: 'దిశ చట్టం... ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి?'