తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బీసీ నేత కోసం తెరాస పావులు కదుపుతోంది. తెలుగుదేశంను వీడే యోచనలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఉన్నట్లు తెలుస్తోంది. తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణకు తెరాస ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఎల్.రమణకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి.
L.Ramana: తెరాసలోకి తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ! - TDP L Ramana Going to Join TRS
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ తెరాసలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనతో చర్చలు జరుపుతున్నారు. గులాబీ తీర్థం తీసుకోవడంపై రమణ ఇంకా నిర్ణయం తీసుకోనట్లు సమాచారం.
TDP L Ramana Going to Join TRS
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రమణతో సంప్రదింపులు జరుపుతున్నారు. గులాబీ తీర్థం తీసుకోవడంపై రమణ ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా నుంచి కూడా ఆహ్వానం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :mp raghu rama: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామ లేఖ