ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

22 జర్మన్​ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.. రూ. 3.52 కోట్లు మంజూరు - తిరుమల వార్తలు

కరోనా రోగుల చికిత్సకు బెడ్లు దొరకని పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్​ షెడ్లను నిర్మించడానికి తితిదే నిర్ణయించింది. అవసరమైన నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.

22 జర్మన్​ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.
22 జర్మన్​ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.

By

Published : May 13, 2021, 4:32 PM IST

Updated : May 13, 2021, 5:06 PM IST

22 జర్మన్​ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.

కోవిడ్ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలో 22 జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడం.. ఆసుపత్రులన్నీ కోవిడ్‌ భాదితులతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలోనూ పడకల కొరత ఏర్పడడంతో.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 3.52 కోట్లతో వివిధ ప్రాంతాల్లో షెడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.

ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్ నిర్మించి అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా షెడ్లు నిర్మించాలని తితిదేకి అనేక విజ్ఞప్తులొచ్చాయి. దీంతో ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మేరకు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయో నిధి నుంచి దీనికి అవసరమైన సొమ్మును తితిదే సమకూర్చింది.

జిల్లాల వారీగా నిర్మించనున్న జర్మన్ షెడ్లు..

కృష్ణాలో- 3, గుంటూరులో- 3, కాకినాడలో- 3, విశాఖలో- 4, ప్రకాశంలో- 2, అనంతపురంలో- 3, కర్నూలులో- 2, ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లను నిర్మించాలని తితిదే నిశ్చయించింది. వీటికి అవసరమైన నిధులను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తితిదే స్పష్టం చేసింది. ఒక్కో షెడ్​లో దాదాపు 30 ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన బెడ్లను ఏర్పాటు చేయనుంది.

ఇవీ చదవండి:

'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

తితిదేకు హనుమద్ జన్మభూమి లేఖ.. చర్చకు రేపు రమ్మన్నా వస్తాం

Last Updated : May 13, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details