తితిదే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేసిన సామాజిక మాద్యమాలు, మీడియా సంస్థలపై కేసు నమోదు చేసినట్లు తిరుపతి తూర్పు పీఎస్ సీఎ బీవీ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలను చైనాకు తితిదే స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తితిదే ఏవీఎస్వో కళావతి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి తప్పుడు ప్రచారం చేసిన వారు, వాటిని సోషల్ మీడియా వైరల్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తలనీలాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ తితిదే ఫిర్యాదు - tirumala tirupati devasthanam latest news
శ్రీవారి భక్తులకు సమర్పించిన తలనీలాలకు సంబంధించి అసత్య కథనాల ప్రచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తితిదే. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తితిదే ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ప్రచారం చేశారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
తితిదే తలనీలాల వివాదం
Last Updated : Mar 31, 2021, 7:26 AM IST