ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి దర్శనం ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం: తితిదే ఛైర్మన్ - darshan at the tirumala temple news

తిరుమల స్వామివారి దర్శనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతోనే లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నామని తెలిపారు.

ttd chairman yv subbareddy
ttd chairman yv subbareddy

By

Published : May 20, 2020, 3:39 PM IST

అరవై రోజులుగా స్వామి వారి దర్శనం కల్పించలేకపోవడం బాధాకరమని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడు దర్శనాలు ప్రారంభిస్తామనేది చెప్పలేమని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నామని వెల్లడించారు.

రూ. 25లకే లడ్డూ అందించేలా చర్యలు చేపడుతున్నామని తితిదే ఛైర్మన్ చెప్పారు. తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కల్యాణమండపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేక ఆర్డర్​పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేస్తామని తెలిపారు. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్‌ చేయవచ్చని వివరించారు. ఈ మేరకు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ 98495 75952,ఆలయ పేష్కార్ శ్రీనివాస్‌-97010 92777 ఫోన్ నెంబర్లను వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details