హిందూ ధర్మ ప్రచార కోసం తితిదే నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. దిల్లీలో కేంద్ర మంత్రిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి ప్రసాదం, నూతన సంవత్సరం కాలమాన పట్టిక, క్యాలెండర్లను అందించి మంత్రిని శాలువతో సన్మానించారు. కొంత సమయం మంత్రితో సమావేశమైన ఛైర్మన్ తితిదేలోని పలు కార్యక్రమాలను వివరించారు.
కేంద్రమంత్రిని కలిసిన తితిదే ఛైర్మన్ - తితిదే వార్తలు
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దిల్లీలో కలిశారు. హిందూ ధర్మ ప్రచార కోసం తితిదే నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్రమంత్రి కొనియాడారు.
కేంద్రమంత్రిని కలిసిన తితిదే ఛైర్మన్