ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్యాకుమారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో తితిదే చైర్మన్​ - తితిదే చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి వార్తలు

తమిళనాడు కన్యాకుమారిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా హాజరయ్యాారు. స్థానిక వివేకానందట్రస్ట్ సహకారంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ttd chirmen in kanyakumari balaji temple second anniversary
కన్యాకుమారి ఆలయ ద్వితీయ వార్షకోత్సవంలో తితిదే చైర్మన్​

By

Published : Jan 27, 2021, 8:10 PM IST

తితిదే చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా తమిళనాడు కన్యాకుమారిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. తితిదే స్థానిక సలహా కమిటీ ప్రెసిడెంట్​ శేఖర్​ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులతో కలిసి సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానందట్రస్ట్ సహకారంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కరోనా ప్రభావంతో కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడిందన్నారు. వివేకానంద ట్రస్ట్ తితిదేకు చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంతకు సంఖ్యను పెంచుతామని చైర్మన్ తెలిపారు.

ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABOUT THE AUTHOR

...view details