ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఓ మహిళకు తితిదే ఛైర్మన్ పదవి ఇవ్వాలి'

తితిదే ఛైర్మన్ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఓ మహిళకు ఇవ్వాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రభుత్వాన్ని కోరారు. వైకాపా ప్రభుత్వం చీకటి జీవోలతో అడ్డదారిలో సంచైత గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా ఎలా నియమించిందో అందరికీ తెలుసన్నారు. కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్పడం తగదని పేర్కొన్నారు.

వంగలపూడి అనిత
వంగలపూడి అనిత

By

Published : Jun 23, 2021, 7:48 PM IST

తితిదే ఛైర్సన్ పదవిని వైకాపా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఓ మహిళకు ఇచ్చి తమ విశాల దృక్పథం చాటాలని... తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హితవు పలికారు. కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్ పర్సన్ పదవిపై విమర్శలు చేసిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ పూర్తిగా చదవకుండా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

వైకాపా ప్రభుత్వం చీకటి జీవోలతో అడ్డదారిలో సంచైత గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా ఎలా నియమించిందో అందరికీ తెలుసన్నారు. కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం తగదని పేర్కొన్నారు. వాస్తవాలు గ్రహించి నిజమైన మహిళా సాధికారత సాధించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details