తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 52రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపోలకు తరలివస్తున్నారు. అయితే విధుల్లో చేరే విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి లేదని అధికారులు వారిని చేర్చుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లోకి వచ్చిన సిబ్బందిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.
తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. పలుచోట్ల బస్సులు బయటకు పోకుండా కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అన్ని డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. విధుల్లోకి వస్తున్న తాత్కాలిక కార్మికులను మాత్రమే అనుమతించాలని... సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రవేశం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.