దాదాపు రెండు నెలలుగా టీఎస్ఆర్టీసీకి సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనతో తెరపడింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్... ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము ఎవరి పొట్టలు కొట్టదల్చుకోలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలోనే విజ్ఞప్తి చేసినా... యూనియన్ల మాటలు విని కార్మికులు నష్టపోయారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని కోరిన సీఎం... కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ఆ రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి... ఆర్థికసాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
క్రమశిక్షణా రాహిత్యాన్ని సహిచం....
ప్రభుత్వ నిర్ణయాన్ని అలుసుగా తీసుకుని క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే కార్మికులు మళ్లీ ఇబ్బందుల్లో పడతారని కేసీఆర్ హెచ్చరించారు. కార్మికసంఘాలను పక్కనపెట్టి తాను చెప్పినట్లు వింటే ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దుతాననని ప్రకటించారు. సింగరేణి తరహాలో లాభాలు పంచుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రస్తుత నిర్ణయంతో ఆర్టీసీ సమస్య సుఖాంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... సంస్థకు తక్షణ సాయంగా రూ. 100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సంస్థకు అదనపు ఆదాయం వచ్చేందుకు వీలుగా ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి కిలోమీటర్ కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచుకోవచ్చని తెలిపారు.
విపక్షాలు, యూనియన్లది అత్యుత్సాహం...