ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TSRTC Rates: చిల్లర సమస్య లేకుండా.. టికెట్ల ధరల్లో స్వల్ప మార్పులు - tsrtc new rates

TSRTC rates: పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ రౌండప్‌ చేసింది. చిల్లర సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో టికెట్ల ధరల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

TSRTC rates
TSRTC rates

By

Published : Mar 18, 2022, 1:46 PM IST

TSRTC ticket prices round up: పల్లె వెలుగు బస్సు టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలను టీఎస్​ఆర్టీసీ రౌండప్‌ చేసింది. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

12 రూపాయల ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధరను 10కి తగ్గించారు. 13, 14 రూపాయలు ఉన్న టికెట్‌ ఛార్జీని 15 రూపాయలకు పెంచారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది. టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్​ఆర్టీసీ ప్రకటించింది.

VC Sajjanar : కరోనా, లాక్‌డౌన్, ఒమిక్రాన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ పబ్లిసిటీ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

  • ఇదీ చదవండి :

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. అప్పట్నుంచే

ABOUT THE AUTHOR

...view details