ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TSRTC Remove Advertisements: 'ఆర్టీసీ బస్సులపై ఆ పోస్టర్లు ఇక కనిపించవు' - ఆర్టీసీ బస్సులపై ప్రకటనలు నిషేధం

ప్రయాణికులే మాకు దేవుళ్లు..వారికి సౌకర్యాలు కల్పించడమే మా విధి..బస్సులో ప్రయాణించేప్పుడు తల ఎత్తుకొని గర్వంగా ప్రయాణించాలి తప్ప.. తలదించుకుని ప్రయాణించే పరిస్థితి రానీయమంటోంది ఆర్టీసీ యాజమాన్యం. బస్సును చూడగానే ఇది మా బస్సు అనే అలోచన కలగాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బస్సులపై ఉండే వాణిజ్య ప్రకటనల పోస్టర్లను దశలవారీగా తొలగించడంతో పాటు బస్సును ఆకర్షణీయమైన రంగులతో అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు.

TSRTC
TSRTC

By

Published : Oct 27, 2021, 7:35 AM IST

ఆర్టీసీ బస్సు అంటే సురక్షితం సుఖవంతం అనే పేరుంది. కానీ అందుకు తగ్గట్లు రాబడి మాత్రం రావట్లేదు. అందుకే యాజమాన్యం ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు చూడగానే వాటిపై కన్పించే అశ్లీలమైన పోస్టర్లతో ప్రయాణికులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. గతంలో టిక్కెట్టేతర ఆదాయం కోసం బస్సులపై పోస్టర్లు అంటించేందుకు ఏజెన్సీలకు ఆర్టీసీ అవకాశం ఇవ్వగా సినిమా పోస్టర్లు, ఇతరత్రా ప్రచార చిత్రాలు అంటించేవారు. తద్వారా ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. కానీ ఆ పోస్టర్లు చూస్తున్నప్పుడు చాలామంది మహిళలు, చిన్నారులు అమ్మాయిలు, కళ్లు మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తన్నాయంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై స్పందించిన ఎండీ సజ్జనార్.. టీఎస్​ఆర్టీసీ బస్సులపై ఎలాంటి పోస్టర్లు అంటించరాదని అధికారులను ఆదేశించారు.

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు బస్సులను శుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల్లోని సీట్లలో దుమ్ము, దూళి పేరుకుపోకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డిపోల వారీగా బస్సుల్లో విరిగిపోయిన అద్దాల వివరాలు సేకరిస్తున్న అధికారులు పగిలిన వెంటనే వాటిని తిరిగి ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అన్నింటికంటే ముఖ్యంగా సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరలో సాంకేతికత జోడించాలని భావిస్తున్న అధికారులు.. జీపీఎస్​ వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా.. ఏ బస్సు ఎప్పుడు వస్తుంది ఏ బస్సు ఎక్కడ ఉంది తదితర వివరాలు తెలిసే అవకాశముందని చెబుతున్నారు. బస్టాపులు, బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు మరిన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. బస్టాండ్‌లలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఆహారపదార్థాలు, తినుబండారాలు విక్రయించే దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానాలు విధిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఎరుపు, తెలుపు, నీలి-తెలుపు రంగులేస్తుండగా వాటితోపాటు ఆకుపచ్చ-లేత ఆకుపచ్చ రంగులను వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ట్విట్టర్, మెయిల్ ఐడీలు ఏర్పాటు చేశారు. ఆ ఫిర్యాదులను స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పర్యవేక్షిస్తున్నారు. జేబీఎస్​, ఎంజీబీఎస్‌లో క్యూఆర్ కోడ్, యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రేతిఫైల్ బస్‌పాస్‌ కౌంటర్‌లోనూ ఆ విధమైన సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం అవసరమైన అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.


ఇదీ చూడండి:

YSR RYTHU BHAROSA: హామీలను సంపూర్ణంగా అమలుచేస్తున్నాం... సీఎం జగన్ వెల్లడి

ABOUT THE AUTHOR

...view details