తెలంగాణలోని భాగ్యనగరంలో గణనాథుని నిమజ్జనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్ల నడుమ సందడిగా సాగుతున్నాయి. నిమజ్జనాన్ని చూడటానికి హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. విభిన్న రూపాల్లో కొలువుదీరి.. 9 రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. సగటు ప్రయాణికునిలా బస్సులో ప్రయాణించారు.
Sajjanar : వినాయక నిమజ్జనానికి ఆర్టీసీ బస్సులో సజ్జనార్.... - rtc md sajjanar in vinayaka nimajjanam
తెలంగాణలోని భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనాలు సందడిగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నిమజ్జనోత్సవంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొని సందడి చేశారు. విభిన్నమైన రీతిలో వినాయకుడిని ఊరేగించారు. ఆర్టీసీ బస్సులో కూర్చుని కుటుంబసభ్యుల సందడి మధ్య వినాయక విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్లారు.
వినాయక నిమజ్జనానికి ఆర్టీసీ బస్సులో సజ్జనార్....
సజ్జనార్.. తన ఇంట్లో గణనాథుడికి 9రోజుల పాటు ఘనంగా పూజలు చేసి ఈ రోజు నిమజ్జనం చేయడానికి బయలుదేరారు. కార్లు, ప్రత్యేక వాహనాల్లో కాకుండా సగటు ప్రయాణికునిలా బస్సులో ప్రయాణించారు. వినాయకుడి విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. ప్రయాణ సమయంలో కుటుంబీకులు పాటలు పాడుతూ సందడి చేశారు.
ఇదీ చదవండి:Balapur laddu Auction: వేలంలో రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..