TSRTC News: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వరస షాకులిస్తోంది. ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే టికెట్ ఛార్జీల పెంపు వడ్డించిన టీఎస్ ఆర్టీసీ.. తాజాగా మరో భారం వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా.. తాజాగా మరో రూ.10 పెంచింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్.. రిజర్వేషన్ ఛార్జీలు పెంపు - tsrtc latest news
TSRTC Reservation Charges Hike: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో షాకిచ్చింది. ఇటీవలే టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్జీలు పెంచింది. ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

tsrtc hike charges once again
ఇటీవలే టికెట్ ఛార్జీలను ఆర్టీసీ పెంచిన విషయం తెలిసిందే. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. జనాలకు ఎటువంటి సమాచారమూ లేకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: