ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TSRTC sankranthi income: టీఎస్​ఆర్టీసీకి కాసులు కురిపించిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం

TSRTC sankranthi income: సంక్రాంతి పండుగ తెలంగాణ​ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం ఊరటను, ఉత్సాహాన్నిచ్చింది.

TSRTC
TSRTC

By

Published : Jan 19, 2022, 9:24 AM IST

TSRTC sankranthi income: సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిందని ఆర్టీసీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. సంక్రాంతి సందర్బంగా టీఎస్​ ఆర్టీసీ సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4వేల బస్సులను ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నడిపించింది. ఆర్టీసీలో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామని ఆర్టీసీ ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కరోనాకు ముందు ఆర్టీసీకీ రోజుకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేది. కానీ... సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి:'ఈ పీఆర్సీ అసలే వద్దు.. పాత వేతనాలు, డీఏ ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details