ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Allu Arjun News: దోశ తెచ్చిన తలనొప్పి.. అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు..!

సైలిష్​​ స్టార్​ అల్లు అర్జున్(stylish star allu arjun)​కు లీగల్​ నోటీసులు వెళ్లాయి. సినిమాలు, షూటింగ్​లతో ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు రావటమేంటి..? అందరి పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించే ఈ సైలిష్​స్టార్​(stylish star allu arjun)కు నోటీసులు ఎవరు పంపారు..? తన స్పీచు(allu arjun speech)లతో అభిమానులకు ఎన్నో మంచి విషయాలు చెప్పే బన్నీ.. అంత పెద్ద ఏం తప్పు చేశాడు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

Legal notices to icon star Allu Arjun
హీరో అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు

By

Published : Nov 9, 2021, 9:30 PM IST

Updated : Nov 9, 2021, 10:51 PM IST

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బన్నీ.. మధ్య మధ్యలో కొన్ని ప్రకటన(allu arjun advertisement)ల్లో కూడా నటిస్తుంటాడు. అయితే.. ప్రస్తుతం పుష్ప సినిమా(allu arjun new movie 2021) షూటింగ్​లో ఉన్న బన్నీ.. షెడ్యూల్​ మధ్యలో ఓ వ్యాపార ప్రకటన(Icon Star Allu Arjun Latest Video)లో మాస్​ వ్యక్తిగా నటించాడు. ఇప్పుడు అదే ప్రకటన.. ఐకాన్​ స్టార్​కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అదేనండి.. లీగల్​నోటీసులు తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్​కు టీఎస్​ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ లీగల్​ నోటీసులు పంపించారు. ఆర్టీసీ ప్రతిష్ఠను కించపర్చినందుకు అల్లు అర్జున్​కు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.

తలనొప్పిగా మారిన పాపులర్​ దోశ ..

అల వైకుంఠపురం సినిమాలోని ఓ పాటలో అల్లు అర్జున్​ చేసిన దోశ స్టెప్పు(ala vaikunthapurramuloo dosa step) ఎంత ఫేమసై పేరు తెచ్చిపెట్టిందో.. ఇప్పుడు అదే దోశ బన్నికి తలనొప్పి తెచ్చిపెట్టింది. రాపిడో సంస్థ ఇటీవలే విడుదల చేసిన ప్రకటన(Allu Arjun MASS Rapido AD)లో అల్లుఅర్జున్​ నటించాడు. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్​ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ సంభాషణలు చెప్తాడు. బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని.. ఎలాంటి ప్రయాసలు లేకుండా రాపిడో సేవలను ఉపయోగించుకోవాలని ఆ ప్రకటన సారాంశం.

కించపర్చినందుకే నోటీసులు..

అల్లు అర్జున్​ నటించిన ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​.. బన్నీకి, రాపిడో సంస్థకు లీగల్​ నోటీసులు పంపారు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు సజ్జనార్​ తెలిపారు. టీఎస్​ ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉందని.. అలాంటి సంస్థను కించపర్చినందుకే రాపిడోకు, అల్లు అర్జున్​కు నోటీసులు ఇచ్చినట్టు సజ్జనార్​ పేర్కొన్నారు.

ప్రోత్సహించే ప్రకటనల్లో నటించాలి..

"హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్‌ పంపాం. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు అల్లు అర్జున్‌, రాపిడోకు నోటీసులిచ్చారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోశలతో పోల్చారు. ప్రకటనపై ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి విమర్శలొచ్చాయి. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉంది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. బస్సుల్లో పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు పెడుతున్నాం" - సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

ఇదీ చూడండి:

Last Updated : Nov 9, 2021, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details