హైదరాబాద్‌లోని సకల జనభేరి సభ వద్ద ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. కరీంనగర్ డిపో-2లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎన్.బాబు సభ వద్ద కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. స్థానిక రాజకీయ నేతల ఒత్తడి వల్లే బాబు మృతి చెందినట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. కార్మికుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా రేపు కరీంనగర్ పట్టణ బంద్‌కు అశ్వత్థామ రెడ్డి పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.
సకల జనభేరి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు... మృతి - కరీంనగర్ డిపో-2 డ్రైవర్ బాటు గుండెపోటుతో మృతి
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పాలిట శాపంగా మారిందని డ్రైవర్లు మండిపుడుతున్నారు. హైదరాబాద్‌లోని సకల జనభేరి వద్ద ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. రాజకీయ ఒత్తిల్లే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సకల జనభేరి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు... మృతి