ఆర్టీసీ సమ్మె.. ఆగిన కార్మికుడి గుండె - undefined
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా.. ఆత్మహత్యాయత్నం చేసిన కార్మికుడు మృతి చెందాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ఓ నిండు జీవితం అర్థంతరంగా ముగిసింది. ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం... హైదరాబాద్ తరలించించినా ఫలితం లేకపోయింది. శరీరం 80 శాతం కాలిపోయిన కారణంగా.. శ్రీనివాసరెడ్డిని వైద్యులు కాపాడలేకపోయారు. డ్రైవర్ మరణ వార్త తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు.. అపోలో ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న కారణంగా.. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారు.
TAGGED:
tsrtc driver dead